డబ్బులిచ్చి ప్రమోట్ చేసుకోవడానికే బిగ్ బాస్ రియాలిటీ షో అన్న సరయు
on Jul 25, 2023
బిగ్ బాస్ త్వరలో సీజన్ 7 twaralo తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ షో కోసం చాలా మంది ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు కూడా. ఈ షో ద్వారా చాలా మంది చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గా మారిపోయి మంచి మంచి అవకాశాలను కూడా తెచ్చుకుంటున్నారు. ఈ షోని పొగిడేవాళ్లు ఎంత మంది ఉన్నారో తిట్టేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చింది సరయు. ఈ బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ షో అంతా ఫేక్ అని చెప్పారు. కొంతమంది డబ్బులిచ్చి మరీ తమను ప్రమోట్ చేసుకోవడానికి ఈ షోకి వస్తారని చెప్పింది. జనాలందరినీ పిచ్చోళ్లను చేయడానికే ఉంటాయి ఈ రియాలిటీ షోస్ . అసలు ఈ షోని చూడకండి మీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పారు.
ఆల్రెడీ కొంతమంది ఒక ప్లాన్డ్ స్ట్రాటెజీతోనే వస్తారు, హౌస్ లో గేమ్ ఆడతారు. వాళ్లకు లోపల ఉన్న వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక రిలీఫ్ గా ఉంటుంది. లోపల ఉన్నంతసేపు మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు సరయు. బిగ్‌బాస్ కి వెళ్లి వచ్చాను కాబట్టే ఇప్పుడు ఇలా చెప్తున్నాను. హౌస్ లో ఎంత ఆడినా లోపల వేరే వాళ్లకు సపోర్ట్ ఉంటుంది, మన ఆట వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. యూట్యూబర్ గా ఉన్న సరయు బిగ్ బాస్ సీజన్ 5 లో మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. తర్వాత ఓటీటీలో ప్రసారమైన నాన్ స్టాప్ షోలో కూడా కంటెస్టెంట్ గా వెళ్ళింది. అక్కడ నాలుగో వారంలో బయటకు వచ్చేసింది. ఇందులో మధ్యలోనే బయటకు వచ్చేసింది. సరయు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ ’18 పేజిస్’లో నిఖిల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు సరయు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
